మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ప్రమాణస్వీకారం..

మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ప్రమాణస్వీకారం..

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ఈరోజు మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత రెండు నెలల క్రితం పాలక వర్గం నియామకం జరిగినప్పటికీ మున్సిపల్ ఎన్నికలు, తదితర కారణాలతో ప్రమాణ స్వీకారంలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు కోటపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ ప్రసాద్ తివారీ ఛైర్మెన్ గా, నియోజక వర్గంలోని వివిధ మండలాలకు చెందిన మరికొంతమంది డైరెక్టలుగా మంత్రి వివేక్ అధ్యక్షతన ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Leave a Reply