QuantumTalkByCBN | ఇక క్వాంటం విప్లవం

QuantumTalkByCBN | ఇక క్వాంటం విప్లవం
ఏపీదే లీడ్ రోల్
స్కిల్ రోడ్ మ్యాప్ సిద్దం
రెండేళ్లల్లో అమరావతి నుంచే
క్వాంటం పరికరాల ఉత్పత్తి
క్వాంటం విజన్ ను, విప్లవాన్ని అందిపుచ్చుకోండి
నోబెల్ స్థాయికి మన పరిశోధనలు చేరాలి
క్వాంటం టాక్ బై సీఎం సీబీఎన్
QuantumTalkByCBN ( అంధ్రప్రభ, అమరావతి)

భారత్ లో క్వాంటం టెక్నాలజీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( AP Cm Chandra Babu) స్పష్టం చేశారు. క్వాంటం సహా అనుబంధ రంగాల్లో నిపుణులను తయారు చేసేలా తాము కార్యాచరణ సిద్దం చేశామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం, వైసర్, క్యూబిట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్వాంటం ప్రోగ్రామ్ లో భాగంగా వేల మంది టెక్ విద్యార్ధులతో ముఖ్యమంత్రి క్వాంటం టాక్ బై సీబీఎన్ (Quantum Talk By CBN ) కార్యక్రమాన్ని నిర్వహించారు.
క్వాంటం టెక్నాలజీకి సంబంధించి నిర్వహిస్తున్న అతిపెద్ద శిక్షణా కార్యక్రమంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. క్వాంటం టెక్నాలజీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన విజన్ ను అందిపుచ్చుకోవాలని విద్యార్ధులకు పిలుపునిచ్చారు. ఈ క్వాంటం టాక్ బై సీబీఎన్ కార్యక్రమానికి క్వాంటం ప్రోగ్రామ్ కు రిజిస్ట్రేషన్ చేసుకున్న వేల మంది విద్యార్ధులు పాల్గొన్నారు. అమెరికా నుంచి వైసర్ (Vinor) సంస్థ ప్రతినిధులు, క్యూబిట్ Cubit) , ఐబీఎం (IMB) సంస్థల ప్రతినిధులతో పాటు ఆంధ్రా యూనివర్సిటీ సహా వేర్వేరు ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలల (IT Collages) విద్యార్ధులు, ప్రొఫెసర్లు (Pofessors) పెద్ద ఎత్తున హాజరయ్యారు.
క్వాంటం మెకానిక్స్ (Qantum Mechanics) , అల్గారిథమ్స్ (Algorithm) లాంటి అంశాల్లో 10 లక్షల మంది (10 Lakh Technicians) నిపుణుల్ని, క్వాంటం సాప్ట్ వేర్, హార్డ్ వేర్ రంగాల్లో 3 లక్షల మందిని, అడ్వాన్స్ డ్ రీసెర్చి లో 1 లక్ష మంది నిపుణుల్ని తయారు చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు.
QuantumTalkByCBN : విశాఖ డేటా హబ్ ..

క్వాంటం టాక్ బై సీబీఎన్ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ”ఐటీ విప్లవం అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ నిపుణుల్ని తయారు చేసి ప్రపంచానికి అందించాం. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్ గా ఎదిగింది. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, అరవింద్ కృష్ణ లాంటి భారతీయులే గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Micro soft) లాంటి దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు.
విశాఖలోనూ ఇప్పుడు గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ (Big Data Centre In Visakha) ఏర్పాటు చేయబోతోంది. గతంలో ఐటీఈఎస్ లాంటి సేవల్ని వివిధ దేశాలకు ఇక్కడి నుంచే అందించాం. విశాఖ ఇప్పుడు డేటా సెంటర్లకు గ్లోబల్ హబ్ గా మారుతోంది. ఇక్కడి నుంచే సబ్ సీ కేబుల్ లాంటి వ్యవస్థ కూడా ఏర్పాటు అవుతోంది.
QuantumTalkByCBN : క్వాంటం వ్యాలీగా అమరావతి
అమరావతి నాలెడ్జి ఎకానమీ, క్వాంటం వ్యాలీగా ఉంటుంది. తిరుపతి స్పేస్ సిటీగా నిర్మితం అవుతుంది. అనంతపురం, కడప లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ ఏరో స్పేస్ కేంద్రాలుగా ఉంటాయి. విశాఖ- చెన్నై, చెన్నై, -బెంగుళూరు, బెంగుళూరు, – హైదరాబాద్ కారిడార్లు అతిపెద్ద పారిశ్రామిక కారిడార్లుగా (Industrial Corridors) మారుతున్నాయి. ఏపీని క్వాంటంతో పాటు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తున్నాం. వచ్చే 20 ఏళ్లలో చేపట్టాల్సిన రాష్ట్రాభివృద్ధికి ఇప్పుడే కార్యరూపం ఇస్తున్నాం. అమరావతిలో క్వాంటం వ్యాలీ ద్వారా ఓ ఎకో సిస్టమ్ ను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. భారత్ లో నైపుణ్యాలు ఉన్నప్పటికీ, క్వాంటం రంగంలో మరింత పెట్టుబడులు రావావ్సి ఉంది. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా పెద్ద ఎత్తున ఈ రంగంలో పెట్టుబడులు, నైపుణ్య కల్పన కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది.

QuantumTalkByCBN : ఇక క్వాంటం విస్లవంఐటీ విప్లవం లాగా ప్రపంచవ్యాప్తంగా క్వాంటం విప్లవాన్ని కూడా భారతీయులు అందిపుచ్చుకోవాల్సి ఉంది. ( Quntm Revolution ) వైద్యం, విద్యుత్, సుస్థిర వ్యవసాయం, ఫైనాన్షియల్ మోడలింగ్, మెటీరియల్స్ డిస్కవరీ, వెదర్ ఫోర్ కాస్టింగ్ లాంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ పరిశోధనలు మానవాళికి ఉపకరిస్తాయి. ఏఐ, క్వాంటం, శాటిలైట్, డ్రోన్ లాంటి టెక్నాలజీలతో వివిధ రంగాల్లో సుస్థిరత సాధించే అవకాశం ఉంటుంది. అతి తక్కువ వ్యయంతోనే ప్రజలకు సేవలు అందించవచ్చు. క్వాంటం టెక్నాలజీ ద్వారా పరిశోధనలకు ఆకాశమే హద్దు.” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
