Strikes | ఇండ్ల స్థలాల కోసం…

Strikes | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఇవాళ‌ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈసంద‌ర్భంగా వక్తలు మాట్లాడుతూ… తమ న్యాయమైన కోరికలు నేరవేర్చాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ పట్టించుకోక‌పోవ‌డంతోనే దీక్షలకు దిగామని చెప్పారు. తమ న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు దీక్షను విర‌మించేది లేదని వక్తలు స్పష్టం చేశారు.

Leave a Reply