Jana Sena Shock | హైకోర్టులో జనసేన పిటిషన్ తిరస్కరణ

Jana Sena Shock | హైకోర్టులో జనసేన పిటిషన్ తిరస్కరణ

జనసేనకు హైకోర్టులో చుక్కెదురు..

Jana Sena Shock | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న బహిరంగ సభకు సంబంధించి జనసేన పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. సభ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.

పోలీసుల నిర్ణయానికి వ్యతిరేకంగా జనసేన తరఫున దాఖలు చేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఈరోజు హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ సభ జరిగే అవకాశం లేదని స్పష్టమైంది.

సభకు అనుమతి కోసం జనసేన నేతలు చివరి వరకు ప్రయత్నించినప్పటికీ, కోర్టు నుంచి అనుకూల నిర్ణయం రాకపోవడంతో పార్టీ వర్గాలకు నిరాశ ఎదురైంది. పోలీసుల అనుమతి లేకపోవడం, హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరించడం వంటి పరిణామాలతో సభ నిర్వహణపై సందిగ్ధతకు తెరపడింది.

ఈ పరిణామం జనసేనకు రాజకీయంగా పెద్ద షాక్‌గా మారింది. సభ ఏర్పాట్లపై ఆశలు పెట్టుకున్న కార్యకర్తలు, అభిమానులు కోర్టు నిర్ణయంతో నిరాశకు గురయ్యారు.

Leave a Reply