ఫ్యాషన్ లో కొత్త విప్లవాన్ని సృష్టిస్తున్న బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

ఫ్యాషన్ లో కొత్త విప్లవాన్ని సృష్టిస్తున్న బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

ఫ్యాషన్ యొక్క తదుపరి చర్యను రూపొందించే నైపుణ్యం యొక్క సాహసోపేతమైన కొత్త వ్యాఖ్యానంతో ఈ టూర్ కొల్ కత్తాలో ముగిసింది.

కొల్ కత్తా, డిసెంబర్ 22, 2025 : ఫ్యాషన్ కళకు తెలిసిన పద్ధతులను అధిగమించి ఒక కొత్త అమోఘమైన కథను సమర్పిస్తూ బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ఈ సంవత్సరం ఎడిషన్ ను ముగించింది. దిగ్గజపు హౌరా బ్రిడ్జి యొక్క నాటకీయమైన నేపధ్యంలో మరియు నగరం యొక్క చారిత్రాత్మక హుగ్లీ నదిని అద్భుతమైన రన్ వేగా మార్చే ఈ ముగింపు ఎడిషన్ డిజైనర్ అనామిక ఖన్నా AKచే ప్రయోగాత్మకమైన కలక్షన్ ను ప్రదర్శించింది. ఆకర్షణీయమైన ఇషాన్ ఖట్టర్ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణతో ఇది సంప్రదాయాన్ని అధిగమించి డిజైన్ ను ముందుకు తీసుకువెళ్లింది మరియు ఫ్యాషన్ ను తదుపరి యుగంలోకి తీసుకువెళ్లింది.

ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( FDCI ) సహకారంతో, ఈ ప్రదర్శన కళా పనితనం యొక్క దీర్ఘకాల భావనలను సవాలు చేసింది, దానిని స్థిరమైన సంప్రదాయంగా కాకుండా సజీవమైన, అభివృద్ధికరమైన పరిమాణంగా పరిగణిస్తుంది. అనామికా ఖన్నా యొక్క AK | OK ప్రసిద్ధి చెందిన జర్దోజి, చికన్ కారీ మరియు మిర్రర్ పనితనం ప్రదర్శించింది- వాటిని ప్రత్యేకంగా నిలబెట్టింది మరియు ఆధునిక టైలరింగ్, మెటాలిక్ జోక్యాలు మరియు విశ్వంతో ప్రేరేపించబడిన గ్రాఫిక్స్ ద్వారా పునః కూర్పు చేసింది.

హుగ్లీ నది మధ్యలో లంగరు వేసిన ఒక పడవపై ఈ ప్రదర్శన జరిగింది. దానిని ఫ్యాషన్ యొక్క తేలియాడే ధియేటర్ గా మార్చింది. డైవర్స్ పడవలోకి రావడం మరియు కాంతి, పొగ, శబ్దాలు ద్వారా సజీవంగా మారడంతో ఇది ప్రారంభమైంది. ప్రతిస్పందించే లేజర్స్ ప్రతి స్టెప్ తో మారుతూ , ప్రదర్శన యొక్క వేగాన్ని మరియు ఉద్వేగాన్ని రెట్టింపు చేస్తూ , నిర్మాణం లోపల నుండి అత్యంత ఉత్సాహవంతమైన స్కోర్ కు మోడల్స్ కనిపించారు. కథనం శక్తివంతమైన చెయిన్ మెయిల్ రూపాలతో ఏకీకృత స్టేట్మెంట్ గా ప్రదర్శించబడింది, తదుపరి చలనంలో శిల్పాల సిల్హౌటీస్ ఉన్నాయి. ఇషాన్ వేగవంతమైన పడవలో రావడంతో నాటకీయమైన ఉన్నతమైన స్థాయిని ముగింపు అందించింది. ఇది దిగ్గజపు హౌరా వంతెనకు ఎదురుగా ఏర్పాటు చేయబడిన సామూహిక ముగింపు క్షణంతో ముగిసింది.

నగరంలోని ప్రసిద్ధి చెందిన వారిని పడవలోకి తీసుకురావడానికి ముందు వారికి ఆతిధ్యం ఇచ్చిన మ్యూజియం వంటి లోపలి భాగాలతో మరియు చారిత్రక వివరాలతో కూడిన ద బెంగాల్ పాడిల్ అనే నౌక ఆ సాయంత్రానికి మరింత ప్రాధాన్యతను చేర్చింది. హుగ్లీ వారసత్వాన్ని గుర్తించే అరుదైన సముద్ర కళాఖండాలు మరియు కూర్చిన ఇన్ స్టలేషన్స్ ను కలిగిన దాని పూర్వ బాయిలర్ గదిలో రివర్ లైన్ మ్యూజియం, ప్రదర్శన యొక్క ఆధునికతను పూర్తి చేసిన లీనమయ్యే సాంస్కృతిక నేపధ్యం సృష్టించింది.

దేబాశ్రీ దాస్ గుప్తా, CMO, పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఇలా అన్నారు, “ఫ్యాషన్ మరియు సాంస్కృతిక సంభాషణలను తీర్చిదిద్దడంలో బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ ఎల్లప్పుడూ ప్రధమ స్థానంలో ఉంటుంది. ఈ ఎడిషన్ యొక్క అంతిమ అధ్యాయంగా, ఫ్యాషన్ ను వాస్తవంగా పరివర్తనంగా మార్చే నిజమైన సారాంశాన్ని కొల్ కత్తా అందచేసింది. ‘ ఫ్యూచర్ ఈజ్ క్రాఫ్టెడ్’ (భవిష్యత్తు రూపొందించబడింది) కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు- అసాధారణమైనది ఏదో సృష్టించడానికి ఆవిష్కరణ మరియు వారసత్వాలు ఏ విధంగా కలిసిపోయాయి చూపించే శక్తివంతమైన ప్రకటన ఇది.”

డిజైనర్ అనామిక ఖన్నా ప్రదర్శన గురించి ఇలా అన్నారు, “బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ తో కలిసి ఆధునిక ప్రపంచం కోసం భారతీయ కళా పనితనంను ఎలా విశ్లేషించి, తిరిగి సృష్టించవచ్చు ప్రదర్శించడం నాకు చాలా ఆనందం కలిగించింది. వారసత్వం యొక్క ఈ సాహసవంతమైన పునః వ్యాఖ్యానాన్ని ప్రేక్షకులు స్వీకరించడం చూసి ఎంతో ఉత్సాహంగా ఉంది.”

ప్రదర్శనకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఇషాన్ ఖట్టర్ ఇలా అన్నారు, “బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ లో భాగంగా ఉండటం అనేది ప్రయోగాలు చేయాలని మరియు ఆశించిన వాటికి మించి ముందుకు కొనసాగాలని నా సొంత సహజమైన ధోరణికి పూర్తిగా అనుగుణంగా ఉందని భావించాను. కళా నైపుణ్యం దాని సంప్రదాయబద్ధమైన రూపం నుండి బయటకు వచ్చి మరింత చురుకైన, మరింత వ్యక్తీకరణ రూపం పొందడం గమనించిన అనుభవాన్ని ఎంతో ఉద్వేగంగా మార్చింది. అలాంటి దిగ్గజపు నేపధ్యంలో, ఫ్యాషన్ కేవలం ప్రదర్శితమవడమే కాకుండా చురుకుగా తీర్చిదిద్దబడిన క్షణంలో భాగంగా ఉందని భావన కలిగింది.“

సునీల్ శేథీ, ఛైర్మన్, FDCI ఇలా అన్నారు, “FDCI బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ తో సహకారంపై ఆనందంగా ఉంది, ఈ సహకారం ద్వారా ఫ్యాషన్ యొక్క రెండు శక్తివంతమైన దిగ్గజాలను ఏకం చేసి దాని భవిష్యత్తును రూపొందిస్తుంది. కొల్ కత్తా ఎడిషన్ సృజనాత్మకత, సంస్కృతిలను సంబరం చేసింది మరియు భారతదేశపు ఫ్యాషన్ లో రాబోయే ట్రెండ్ కోసం మార్గం ఏర్పాటు చేసింది.”

Leave a Reply