పుస్తకాల పండుగలో పవిత్రంగా పరిమళిస్తున్న ‘ శ్రీమాలిక ‘

పుస్తకాల పండుగలో పవిత్రంగా పరిమళిస్తున్న ‘ శ్రీమాలిక ‘
ఈ సంవత్సరం కూడా పురాణపండ పుస్తకాలదే హవా !
హైదరాబాద్ : డిసెంబర్ : 22
గత సంవత్సర కాలంగా జైత్రయాత్రగా దూసుకుపోతున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ నాలుగు వందల పేజీల అపురూప దైవీయ గ్రంధం ‘ శ్రీమాలిక ‘ ఈసారి 38 వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోనూ తన సంచలనాత్మక పవిత్ర హవా చూపిస్తూ అమ్మకాల్లో అగ్రస్థానంలో దూసుకుపోతోందని పుస్తక విక్రేతలే స్వయంగా మీడియాకు చెప్పడం ఆశ్చర్యాన్ని , ఆనందాన్ని కలిగిస్తోందని పలువురు భక్త పాఠకులు , సాహిత్య వేత్తలు పేర్కొంటున్నారు.
ఇప్పటికి ఇరవైఐదు పునర్ముద్రణలకు పైగా ప్రచురించబడ్డ ఈ శ్రీమాలిక అఖండ గ్రంధాన్నిబెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దేవస్థానం సన్నిధానంలో నాటి అసిస్టెంట్ కమీషనర్, కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావు పర్యవేక్షణలో విఖ్యాత ప్రవచనకర్త , మహాసరసతీపుత్రులు చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించి పురాణపండ శ్రీనివాస్ నిరాఘాటంగా చేస్తున్న అసాధారణ కృషిని, అద్వితీయ సృజనాత్మక ప్రతిభను , మరీ ముఖ్యంగా నిస్వార్ధ ధార్మిక సేవను ప్రశంసిస్తూ ఆశీర్వదించడం విశేషంగా పేర్కొనాలి.

యుగే యుగే , నన్నేలు నాస్వామి, అమ్మణ్ణి , భద్రే రుద్రే , నిన్నే సేవింతున్ , నేనున్నాను,
దుర్గే ప్రసీద, శరణు శరణు , శంకర శంకర , అదివో అల్లదివో … వంటి పరమాద్భుత గ్రంథాలెన్నింటినో తెలుగు జాతికి అందించి లక్షల పూజాపీఠాలముందు మంత్రం కలశంలా కూర్చున్న పురాణపండ గ్రంధాల గురించి పీఠాల , మఠాధిపతులతోపాటు అనేక ఆలయాల ధర్మకర్తలు, అర్చక వేదపండితులు ముక్తకంఠంతో ప్రశంసించడం కన్నులముందే కనిపించే సత్యం.
ఈ బుక్ ఫెయిర్ లో వందల ప్రచురణ సంస్థలు పాల్గొన్నా ఆధ్యాత్మిక గ్రంధాల అమ్మకాల సంస్థలైన ప్రఖ్యాత పబ్లిషర్స్ నవచేతన బుక్ హౌస్, గొల్లపూడి వీరాస్వామి సన్ , మోహన్ పబ్లికేషన్స్ వంటి అనేక చోట్ల శ్రీమాలిక వేగంగా అమ్ముడుపోవడం గమనార్హం.
హైదరాబాద్ కేంద్రంగా సుమారు నూట ఇరవైమంది ప్రఖ్యాత రచయిత్రుల , కవయిత్రుల వేదికగా పేరుపొందిన ‘ లేఖిని ‘ సంస్థ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బుక్ స్టాల్ లో తమ వద్దకు వచ్చి తమ బుక్ కొన్న ప్రతీ ఒక్కరికీ పురాణపండ శ్రీనివాస్ అపురూప మంత్రం పేటిక శ్రీమాలిక బుక్ ను ఉచితంగా బహూకరించడంవల్ల … బుక్ ఫెయిర్ లో లేఖిని సంస్థ పేరు ప్రత్యేకంగాను, పుస్తకాల పండుగకు విచ్చేసిన వందలమంది పాఠకుల చేతుల్లో శ్రీమాలిక గ్రంధం కనిపించడంతో ఈ ధనుర్మాసపు చలిరాత్రివేళ పురాణపండ శ్రీనివాస్ వ్యాఖ్యానాల శోభ , నరసింహ స్వామి వారి కథాఘట్టాన్ని కొందరైతే అక్కడే చదవడం మీడియా కంటబడింది.

లేఖిని సంస్థలో ఉత్సాహవంతమైన భూమిక పోషించే ప్రముఖ రచయిత్రులు అత్తలూరి విజయలక్ష్మి, చెంగల్వల కామేశ్వరి, జ్యోతి వల్లబోజు , కుసుమా ఉప్పలపాటి, అల్లూరి గౌరిలక్ష్మి, మణీ వడ్లమాని, సర్వమంగళ గౌరి , రేణుకా అయోలా, గాయత్రీ పెండ్యాల, నండూరి సుందరీ నాగమణి, సరస్వతి కరవది, సర్వమంగళ గౌరి, పెన్మెత్స(అల్లూరి) గౌరీ లక్ష్మి తదితరులు సాంఘిక, సాంస్కృతిక , అభ్యుదయ గ్రంధాల అమ్మకంతో పాటు శ్రీమాలిక వితరణ మంగళ కార్యం నిర్వహించడం ఉత్తమ సంచలనంగానే చెప్పాలి.

రెండు దశాబ్దాలుగా తీవ్రమైన ఎన్నో ఎత్తుపల్లాలమధ్య , కష్ట సుఖాల మధ్య ఎన్నెన్నో అద్భుతాలు దైవబలంతో సృజియిస్తున్న అక్షర బలాల రచయిత, అరమరికలు లేని అచ్చమైన స్వచ్ఛ హృదయమున్న పురాణపండ శ్రీనివాస్ అప్రతిహత నిస్వార్ధ సేవను మాత్రం మరువలేమని లేఖిని బృందం ముక్తకంఠంతో పేర్కొనడం ప్రత్యేకమైనదే !
మరోప్రక్క విఖ్యాత ప్రవచనకారులు చాగంటి కోటేశ్వర రావు, గరికపాటి నరసింహారావు, సామవేదం షణ్ముఖ శర్మ, వద్దిపర్తి పద్మాకర్, ఇషా ఫౌండేషన్ గ్రంధాల అమ్మకం కూడా సోమవారం నుండీ వేగం పెరిగినట్లు ప్రచురణకర్తలు చెబుతున్నారు. మరో వైపు ఎప్పటికప్పడు బుక్ ఫెయిర్ కమిటీ అధ్యక్షులు , ప్రఖ్యాత కవి యాకూబ్ అన్ని ఏర్పాట్లను తమ కమిటీ సభ్యుల సంఘీభావ సహకారంతో పర్యవేక్షిస్తున్నారు.
TAG LINES ;
PURANAPANDA SRINIVAS
LEKHINI RACHAYITRULA VEDIKA
SREEMAALIKA BOOK
2025 HYDERABAD BOOK FAIR
