Meeting | మంత్రి జూపల్లిని కలిసిన మాజీ మంత్రి అల్లోల

Meeting | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : నిర్మల్ నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల అన్ని విడతల్లోనూ హస్తానిదే పైచేయి. మొత్తంగా 71 సర్పంచి స్థానాలు కైవసం చేసుకోవడంతో పాటు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపమని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లిని కలిసి డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు వివరించారు.
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. ప్రజల విశ్వాసానికి నిదర్శనం : మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ జిల్లా DCC అధ్యక్షుడు, ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ను కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూడా నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తాను చూపుతామని ఈ సందర్భంగా మంత్రికి వారు హామీ ఇచ్చారు.
