Mission Bhagiratha | మంత్రిని విమర్శించే స్థాయికాదు

Mission Bhagiratha | మంత్రిని విమర్శించే స్థాయికాదు

Mission Bhagiratha | చెన్నూర్, ఆంధ్రప్రభ : అభివృద్ధి పేరుతో కమిషన్లు కాజేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏ మచ్చలేని మంత్రి వివేక్ వెంకటస్వామిని విమర్శించే స్థాయి కాదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి అన్నారు. ఈ రోజు స్థానిక ప్రెస్ క్లబ్ లో పార్టీ నాయకులతో కలిసి సోమవారం మంత్రి వివేక్ పై బాల్క సుమన్ చేసిన వాఖ్యలను ఖండించారు.

రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో కేవలం కమిషన్ల కొరకు మిషన్ భగీరథ(Mission Bhagiratha), ఇంటిగ్రేడ్ మార్కెట్, తదితర కార్యక్రమాలు చేపట్టి అసంపూర్తిగా వదిలేశారని ఆరోపించారు. మంత్రిని విమరర్శించిన బాల్క పేదలకు ఒర‌గ‌బెట్టింది ఏమి లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు కొత్త రేషన్ కార్డులు(ration cards), ఇందిరమ్మ ఇండ్లు, మహిళల సంక్షేమనికి పెద్ద పీట వేస్తుందని అన్నారు, మంత్రి వివేక్ నియోజకవర్గంలోని అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజా మన్నలను పొందుతుంటే జీర్ణించుకోలేని బాల్క సుమన్ తప్పు ఆరోపణలు చేస్తున్నాడని, మీ తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు.

Leave a Reply