Award | లంబాడి జీవనశైలి జాతీయస్థాయి గుర్తింపు..

Award | లంబాడి జీవనశైలి జాతీయస్థాయి గుర్తింపు..

  • ఏళ్ళ భయ్యన్నకు అవార్డు

Award | చిట్యాల, ఆంధ్రప్రభ : లంబాడి జీవనశైలి, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను ఫోటోగ్రఫీ(Photography) ద్వారా ప్రతిబింబించినందుకు నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిట్యాల మున్సిపాలిటీ సీనియర్ పాత్రిక్రియలు డిజిటల్ లక్ష్మి స్టూడియో యజమాని ఏళ్ళ భయ్యన్నకి జాతీయ స్థాయిలో స్పెషల్ చిత్రం లంబాడా అవార్డు(Award) లభించింది.

ప్రముఖ ఫాకల్టీ హుస్సేన్ ఖాన్ (AFIAP) ఆధ్వర్యంలో జాతీయ స్థాయి లంబాడి లైఫ్‌స్టైల్ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్, అవార్డు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం, ఇల్లందు మండలం, రాళ్ళబండ గ్రామంలో డిసెంబర్ 13 నుంచి 15, 2025 వరకు ఘనంగా నిర్వహించబడింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్లు, కళాకారులు, సంస్కృతి ప్రేమికులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని లంబాడి మహిళల జీవితం, వారి శ్రమ, ఆనందం, సంప్రదాయాలు, గ్రామీణ జీవన విధానాన్ని ఫోటోగ్రఫీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు.

ఈ సందర్భంగా లంబాడి జీవనశైలిని ప్రతిబింబించే ఉత్తమ ఫోటోగ్రఫీకి అవార్డులు ప్రదానం చేయగా, ఏళ్ళ భయ్యన్నచిత్రాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ స్పషల్ చిత్రం(Special Feature) లంబాడి అవార్డ్ ఫోటోగ్రఫీ అకాడమీ అఫ్ ఇండియా(Academy of India) వ్యవస్థపకులు తమ్మ శ్రీనివాస్ రెడ్డి(FRPS) చేతుల మీదుగా ఏళ్ళ భయ్యన్న స్వీకరించారు.

కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ఆయనను అభినందించారు. రాళ్ళబండ గ్రామంలో ఈ స్థాయి జాతీయ వర్క్‌షాప్ నిర్వహించడం గర్వకారణమని, గ్రామీణ సంస్కృతి పరిరక్షణకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. భయ్యన్న కు అవార్డు రావటం పట్ల ఫోటో గ్రాఫర్లు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమం లో ఫాకల్టీ షేక్ హుస్సేన్, వెంకట్, ఖమ్మం జిల్లా ఫోటోగ్రఫీ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply