Sarpanch | గ్రామాభివృద్ధి కోసం గెలిపించండి..

Sarpanch | గ్రామాభివృద్ధి కోసం గెలిపించండి..
రాఘవపట్నం సర్పంచ్ అభ్యర్థి రాగం వజ్రవ్వ శంకరయ్య
Sarpanch | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం సర్పంచ్ స్థానానికి పోటీ పడుతున్న రాగం వజ్రవ్వ శంకరయ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెలుపు దిశగా పయనిస్తున్నారు. గతంలో సర్పంచ్ గా పనిచేసిన శంకరయ్యకు ఎలాంటి వ్యతిరేకత లేదు. బహుజన బిడ్డ, మృధుశాలి అయిన వజ్రవ్వ శంకరయ్యకు అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా ముదిరాజ్ బిడ్డ అయిన వజ్రవ్వకు ముదిరాజులు అందరూ ఒక తాటిపై వచ్చి మద్దతు పలుకుతున్నారు.
