3trillion dollors | గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలు

3trillion dollors | గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలు
మన సమ్మిట్ ఓ సంచలనం
పెట్టుబడులతో ఇక పరుగులే
3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల కోసం చర్యలు
గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలు సమున్నతమైనవి..
వాటి సాధనకు తక్షణ కార్యాచరణ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఆవిష్కరణలకు ప్రాణం పోస్తాం తెలంగాణ రైజింగ్ కు దిగ్గజ సంస్థల నుంచి తిరుగులేని ప్రోత్సాహం
3trillion dollors | తెలంగాణ రాష్ట్ర భవితవ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం మహా సంకల్పం తీసుకుంది…అందుకు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనదైన పరిష్కారాలను చూపుతున్నారు. గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ రైజింగ్- 2047 దార్శనిక పత్రం ద్వారా రేవంత్రెడ్డి ప్రభుత్వం తమ ముందున్న చారిత్రక సవాళ్లను, వాటి పరిష్కారాలను ఆవిష్కరించింది. పెట్టుబడులు, ఆవిష్కరణలతో 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుబడుల సదస్సును నిర్వహించింది.

ఎవరూ ఊహించని రీతిలో దేశ, విదేశీ దిగ్గజ సంస్థల ప్రతినిధులు సమ్మిటు హాజరై రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అందుబాటులో ఉన్న వనరులతో 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించడం కష్టమన్న అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ సరికొత్త ఆర్థిక ప్రణాళికలకు ఈ సమ్మిట్ వేదికగా మారింది.
3trillion dollors | గ్లోబల్ సమ్మిట్ ద్వారా సాధించిన విజయాలను
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పలు సభల్లో నూతన ఆవిష్కరణలతోనే తెలంగాణ వృద్ధి చెందుతుందంటూ ఇచ్చిన పిలుపును.. రాష్ట్రం ఏర్పాటైన దాదాపు పన్నెండేళ్ల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకువచ్చింది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా సాధించిన విజయాలను, తెలంగాణ రాష్ట్రం ముందున్న సవాళ్లు.. వాటి పరిష్కారాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆంధ్రప్రభకు సవివరంగా తెలియజేశారు.
