కమలాపూర్, మార్చి 13 (ఆంధ్రప్రభ) : కమలాపూర్ మండలంలోని డీబీఎం 18 ఎస్సారెస్పీ కెనాల్ కెపాసిటీ కంటే నీటిని ఎక్కువగా విడుదల చేయడంతో భీంపల్లి గ్రామ శివారులో కాల్వ పైనుండి నీళ్లు ప్రవహిస్తూ ఉండడంతో తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సారెస్పీ నీటిపారుదల శాఖ అధికారులు కాలువలను పర్యవేక్షణ చేయకుండానే సామర్థ్యానికి మించి ఇష్టానుసారంగా నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ నీటి పారుదల శాఖ అధికారులు వెంటనే నీటిని తగ్గించి పర్యవేక్షణ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కాల్వ తెగిపోయే ప్రమాదం ఉండడంతో పాటు, కెనాల్ కు సమీపంలో రైల్వే ట్రాక్ ఉండడంతో ఆ నీరు రైల్వే ట్రాక్ పై నుండి ప్రవహించే ప్రమాదం ఉంది.