BONUS | ప్రభుత్వం వరి ధాన్యానికి బోనస్

బోనస్ పట్ల రైతుల హర్షం

BONUS | ఎడపల్లి ఆంధ్రప్రభ : వరి ధాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదువందల రూపాయల బోనస్ మంజూరు చేయడం పట్ల గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో గ్రామ రైతులు టపాకాయలు పేల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రైతు నీరడి రవి కుమార్ (Neeradi Ravi Kumar) మాట్లాడుతూ… రైతును రాజును చేయాలనే సదుద్దేశం తో ప్రభుత్వం అనేక రైతు శ్రేయస్సు పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply