VOTE | కల్లబొల్లి మాటలు నమ్మకండి

VOTE | కల్లబొల్లి మాటలు నమ్మకండి

  • అభివృద్ధికి పట్టం కట్టండి
  • ఎలికట్ట సర్పంచ్ అభ్యర్థి కావాలి లలిత శ్రీశైలం

VOTE | షాద్ నగర్, ఆంధ్ర‌ ప్రభ : కల్లబొల్లి మాటలు చెప్పేవారిని నమ్మి ఓటు వేసి మోసపోవద్దని.. సమర్థవంతులను, ఎలికట్టను అభివృద్ధిపరిచే వ్యక్తికే ఓటు వేసి గెలిపించాలని ఎల్కట సర్పంచ్ అభ్యర్థి కావలి లలిత శ్రీశైలం అన్నారు. శుక్రవారం ఎన్నికల (Election) ప్రచార కార్యక్రమంలో భాగంగా తాము ఎంపీటీసీగా ఉండి గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, ఇంక ఎలిక‌ట్ట‌లో పూర్తి మౌలిక సదుపాయాలతో కూడిన గ్రామాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో మీ ముందుకు వచ్చాన‌న్నారు. త‌న‌ను ఆదరించి.. అభిమానించి మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి త‌నకు అఖండ విజయాన్ని అందిస్తారని ఆకాంక్షిస్తున్నానన్నారు.

    Leave a Reply