క్రీడాకారుల ప్రతిభ జిల్లాకు గర్వకారణం
క్రీడాకారుల ప్రతిభ జిల్లాకు గర్వకారణం
నిజామాబాద్, ఆంధ్రప్రభ : 11వ యూత్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్–2026లో జిల్లా బాస్కెట్‌బాల్ జట్టు ద్వితీయ స్థానం (రన్నరప్) సాధించడం పట్ల జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షులు విజయరావు, కార్యదర్శి బొబ్బిలి నరేష్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబర్చి రన్నరప్‌గా నిలవడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు పోటీ మొత్తం క్రమశిక్షణ, పట్టుదల, జట్టు సమన్వయంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు.
ఈ విజయం క్రీడాకారుల నిరంతర శ్రమ, కోచ్‌ల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం ఫలితమని తెలిపారు. గెలుపు–ఓటములు క్రీడల్లో సహజమేనని, అయితే.. రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం సాధించడం గొప్ప విజయమని అన్నారు. భవిష్యత్తులో మరింత కృషి చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లా పేరు ప్రతిష్ఠలను మరింత పెంచాలని క్రీడాకారులకు సూచించారు. జిల్లాలో బాస్కెట్‌బాల్ క్రీడ అభివృద్ధికి సంఘం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, యువ క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం, శిక్షణ, అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ సందర్భంగా రన్నరప్‌గా నిలిచిన జట్టు సభ్యులు, కోచ్‌లు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి భవిష్యత్తు క్రీడా జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా బాస్కెట్‌బాల్ జట్టు సాధించిన ఈ ఘనత పట్ల క్రీడాభిమానులు, మాజీ క్రీడాకారులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ జట్టుకు అభినందనలు తెలియజేశారు.
