Warangal | గోశాలను దర్శించుకున్న గోవిందాద్రి గోశాల సభ్యులు

Warangal | గోశాలను దర్శించుకున్న గోవిందాద్రి గోశాల సభ్యులు
Warangal | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ గోవిందాద్రి గోశాల సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం గ్రూప్ ఆధ్వర్యంలో రెండవ షిరిడిగా పేరు ప్రఖ్యాతులు పొంది.. కొలిచిన వారికి కొంగుబంగారమై.. గురు పూజ్యులు భగవత్ స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు ఆలయాన్ని దర్శించుకున్నారు. చింతలపల్లి దేవాలయం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ (Nagarjunasagar) రోడ్డులోని చింతపల్లి సాయినాధుడు కొలువుతీరి ఉన్నాడు.
దేవాలయంలో (Temple) సాయి దర్శనం కోసం వస్తున్నటువంటి వేల మందికి ప్రతిరోజూ నిత్యాన్న ప్రసాదం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యాన్న ప్రసాదం కోసం ఉడుతా భక్తిగా తోచిన సాయంగా అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అన్న ఒకే ఒక సూక్తిని ఆదర్శంగా తీసుకొని ఆ పరమశివుడు బోలా శంకరుడు అన్నపూర్ణేశ్వరి మాత దగ్గర అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవి జ్ఞాన వైరాగ్యసిద్ధార్థం భిక్షాందేహించ పార్వతి అన్నారు. ఎంతో గొప్పదైనటువంటి అన్న ప్రసాదాన్ని గుర్తు చేసుకుంటూ గర్నపల్లి సుధాకర్ బృందం ఆధ్వర్యంలో సామూహిక విష్ణు సహస్రనామం గ్రూపు సభ్యుల దాతల నుండి ఆ గురు పూజ్యులు సూచించినటువంటి నవవిధ భక్తులు సంఖ్యా 9, ఏకాదశ సూత్రాలు సంఖ్యా 11, అలాగే దాతల నుండి 11. 76 క్వింటాల బియ్యాన్ని సేకరించి చింతలపల్లి సాయినాథ దేవాలయంలో అందజేయడం జరిగిందన్నారు. ఈ దేవాలయం 480 గోవులతో గోశాల నిర్వహిస్తున్నారని గర్నెపల్లి సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది దంపతులు పాల్గొన్నారు.
