Communication Skills | ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్

Communication Skills | ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్
Communication Skills | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండల ఇంగ్లీష్ ఉపాధ్యాయుల అసోసియేషన్(Association) ఆధ్వర్యంలో మండలంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లీష్ భాషలోని నైపుణ్యత, కమ్యునికేషన్ స్కిల్స్(communication skills) పెంపొందించడానికి టీ ఎస్ ఎస్ సీ ఈ ఆర్ టీ, భారతి ఎయిర్ టెల్ ఫౌండేషన్(Bharti Airtel Foundation) వారి ఆధ్వర్యంలో మండల విద్యా వనరుల కేంద్రంలో ఈ రోజు నిర్వహించినట్లు ఎంఈవో ఎన్ ఆంద్రయ్య తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపన్యాసంలో జూనియర్ విభాగంలో పి. చిన్నబాబు జడ్ పి హెచ్ ఎస్ బషీరాబాద్ మొదటి బహుమతి, రూపేష్ జెడ్పీహెచ్ ఎస్(ZPH S) చౌట్ పల్లి ద్వితీయ బహుమతి, సీనియర్ విభాగంలో జే. అమూల్య బషీరాబాద్ మొదటి బహుమతి, సి హెచ్. మధుప్రియ ద్వితీయ బహుమతి, వ్యాస రచన పోటీలో జూనియర్ విభాగంలో ఎం. శివాగౌడ్ కొనసాముందర్ జెడ్పీహెచ్ ఎస్ మొదటి బహుమతి, ఎస్. ప్రసన్న చౌట్ పల్లి ద్వితీయ బహుమతి, సీనియర్ విభాగంలో పి. కార్తికేయ జడ్ పి హెచ్ ఎస్ మొదటి బహుమతి, కమ్మర్ పల్లి, కె.సందీప్ జడ్ పి హెచ్ ఎస్ కొనసాముందర్ ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు.
విజేతలకు మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ ఎల్ టీ ఎ ఉపాధ్యాయులు ఏ.రవీంద్ర, ఎస్ ఎ, కె.మహికాంత్, వి.మధు బాబు, ఉపాధ్యాయులు, మండల అబ్సర్వర్ గా మోర్తాడ్ మండల ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు గున్నాల రవి తదితరులు పాల్గొన్నారు.
