MP| బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే

MP| బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే

  • విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్

MP| విజ‌య‌వాడ, ఆంధ్రప్రభ : సమాజంలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో నలిగిపోతూ అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పూలే కొత్తదారి చూపారు. భారతదేశంలో సామాజిక సంస్కరణ ఉద్యమానికి బీజం మొదటి మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో శుక్ర‌వారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్ర ప‌టానికి పూలు స‌మ‌ర్పించి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. మ‌హాత్మ జ్యోతిరావు పూలే కారణంగానే బడుగు బలహీన వర్గాలకు ఒక గుర్తింపు వచ్చిందన్న సత్యాన్ని ఎవరు కాదనలేరన్నారు.

భావ సారూప్యత కలవారందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి సమాజానికి ఒక కొత్త మార్గాన్ని చూపారని తెలిపారు. చిన్న వయస్సులో వితంతువులైన వారికి స్వయంగా వివాహాలు జరిపించార‌న్నారు. భారత దేశంలో మొదటిసారిగా మహాత్ముడు అని పిలిపించుకున్న గొప్ప సామాజిక తత్వవేత్త అంటూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మానవతావాది పూలే అన్నారు., పులే స్ఫూర్తితో బీసీల అభ్యున్నతికి ఆది నుంచీ తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి బొప్ప‌న భ‌వ‌కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ప‌రిశ‌పోగు రాజేష్ (ద‌ళిత ర‌త్న‌),టిడిపి మ‌హిళ నాయ‌కులు పాల్గొన్నారు.

Leave a Reply