Golden chariot | స్వర్ణర‌థంపై శ్రీ పద్మావతీ విహారం…

Golden chariot |తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతీ స్వర్ణర‌థంపై భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుండి ఆల‌య మాడ వీధుల్లో ఈ ఉత్సవం జ‌రిగింది.

కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ ప‌ద్మావ‌తి విశేష స్వర్ణ‌, వ‌జ్రాభ‌ర‌ణాల‌ను ధ‌రించి భ‌క్తుల‌కు కనువిందు చేశారు. పెద్దసంఖ్యలో మ‌హిళ‌లు పాల్గొని స్వర్ణ ర‌థాన్ని లాగారు.

ఈ కార్యక్రమంలో జేఈవో వి.వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఎస్ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply