CONGRESS | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా

CONGRESS | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా
కొమ్మాయిగూడెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మారేపల్లి మల్లారెడ్డి
రామన్నపేట, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల్లో తనను ఆదరిస్తే కొమ్మాయిగూడం గ్రామాన్ని (Kommayugudam village) అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మారేపల్లి మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు పేదల ఇంటింటికీ చేరే విధంగా కృషి చేస్తానని, డ్రైనేజీ వాటర్ సమస్య లేకుండా పరిష్కరిస్తానని తెలిపారు. పేదల కష్టాలు తీర్చడానికి ఎన్నికల బరిలో దిగుతానని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని, గ్రామానికి సేవ చేస్తూ రుణాన్ని తీర్చుకుంటానని తెలిపారు.
