Games | చిన్న వ‌య‌సులోనే…

Games | చిన్న వ‌య‌సులోనే…

Games | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : అండర్ 18 బాలుర జాతీయ ఫుట్ బాల్ పోటీల(Football competitions)కు షేక్ రాహిల్ వర్షి ఎంపికయ్యాడు. రాహిల్ వర్షి బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తిలో పేద కుటుంబానికి చెందిన బ్యాండ్ మాస్టర్ షేక్ రఫీ కుమారుడు కావడం గొప్పవిషయంగా పేర్కొన వచ్చు. రాహిల్ వర్షిస్థానిక ప్రగతి జూనియర్ కళాశాల(Varsishthanika Pragathi Junior College)లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

షేక్ రాహిల్ వర్షి చదువులోనూ రాణించడమే కాకుండా అంతర్జాతీయ క్రీడ ఫుట్బాల్ పై ఆసక్తి పెంచుకొని పలు మండల, జిల్లా, రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(School Games Federation) ఆధ్వర్యంలో జరిగినా పాల్గొంటూ ఫుట్బాల్ క్రీడలో జయకేతనం ఎగురవేస్తున్నాడు. వివిధస్థాయిల్లో జరుగుతున్న అనేక పోటీల్లో పాల్గొంటూ అన్ని పోటీల్లో విజయాన్ని తన సొంతం చేసుకుంటూ జాతీయ పోటీలకు ఎంపికకావడం గొప్పవిషయంగా చెప్పవచ్చు.

ఇటీవల ఈనెల14 నుంచి16వ తేదీవరకు నల్గొండ జిల్లా కేంద్రంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఫుట్ బాల్ పోటీల్లో పాల్గొన్న షేక్ రాహిల్ వర్షి అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) అండర్ 18బాలుర ఫుట్ బాల్ పోటీలకు క్యాప్టెన్‌గా కూడాఎంపికయ్యాడు.

18 ఏళ్ల వయసులోనే జాతీయ ఫుట్ బాల్ పోటీలకు ఎంపికై బెల్లంపల్లి పట్టణ క్యాతిని, రాష్ట్ర నలుమూలలకు చాటాడు. జాతీయ స్థాయిలోనూ తనకెవరు సాటిలేరనిక్రీడాస్ఫూర్తిని చాటుతున్నాడు. డిసెంబర్ 18 నుంచి జార్ఖండ్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ అండర్ 17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఫుట్బాల్ పోటీల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నాడు.