RTC | ఆర్టీసీ బస్సులో..

RTC | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కోటపెల్లి పోలీసులు పారుపల్లి చెక్ పోస్ట్ వద్ద మహారాష్ట్రకు చెందిన దేశీదారు (మద్యం) బాటిల్ పట్టుకున్నట్లు కోటపెల్లి ఎస్సై రాజేందర్ తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి తెలంగాణలోని జాతీయ రహదారి 63 మీదుగా ఆర్టీసు బస్సు వెళుతుంది. మహారాష్ట్రలోని సిరోంచకు వెళుతున్న ఈ ఆర్టీసీ బస్సును పారుపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది తనిఖీ చేయగా 90 ఎంఎల్, 400 దేశీ దారు బాటిల్ లు దొరికినట్లు తెలిపారు.

మహారాష్ట్ర్ర అమరాజీ గ్రామానికి సోదారి సంజీవ్ అనే వ్యక్తి పై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేసిన్నట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply