CPM | అదే వైఫల్యానికి నిదర్శనం

CPM | అదే వైఫల్యానికి నిదర్శనం


CPM | డోర్నకల్, ఆంధ్రప్రభ : డోర్నకల్ మండలంలోని ధాన్య కొనుగోలు సెంటర్లను తక్షణమే ప్రారంభించాల‌ని, త‌రుగు మోసాల‌ను అరిక‌ట్టాల‌ని సీపీఎం మండల కార్యదర్శి ఉప్పరపల్లి శ్రీనివాస్ అన్నారు. డోర్నకల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఉప్పరపల్లి శ్రీనివాస్ (Upparapalli Srinivas) మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయడంలో విఫలమైయ్యారని అన్నారు. పెన్షన్స్ పెంచకపోవడం, సబ్సిడీ గ్యాస్ అమలు చేయకపోవడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి బిల్లులు ఇవ్వకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని అన్నారు.

గత సంవత్సరం వరి రైతులకు క్వింటాలకు 500 బోనస్ ఇవ్వటంలో ప్రభుత్వ విఫలమైందన్నారు. 3 సంవత్సరాల సంబరాల పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా ఇచ్చిన హామీల అమలు కోసం దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల‌కు, మంచినీళ్లు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. తరుగు, తూకాల్లో మోసం వంటి సంఘటనల నేప‌థ్యంలో అధికారులు జాగ్రత్తతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి ఎండి నవాబ్ (CPM Urban Secretary MD Nawab) మండల నాయకులు దాసరి మల్లేశం, మాచర్ల సైదులు, జేవీఆర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply