Maha Kumbh Mela లో భక్తులు మృతి చెందడం బాధాకరం : కేసీఆర్
మౌనీ అమావాస్య సందర్భంగా ప్రయాగ రాజ్ మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు తొక్కిసలాటలో మరణించడం బాధాకరమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలని, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కేసీఆర్ కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వాకి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.