Male Balappa | బీఆర్ఎస్ నాయకుడు మృతి

Male Balappa | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాలే బాలప్ప (48) గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈయన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

బీఆర్ఎస్ నాయకునిగా మండలానికి సేవలందించారు. ఈయన మృతి పట్ల పలువురు బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామానికి చెందిన మాలే బాలప్ప గత వారం రోజుల క్రితం బ్రెయిస్ట్రోకుతో బాధపడుతూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు.

అప్పటికే కోమాలోకి వెళ్లిన ఆయన ఆపరేషన్ తర్వాత మృతి చెందారు. 2001లో మలిదశ ఉద్యమ సమయంలో రైలు రోకో, రాస్తా రోకో, సకలజనుల సమ్మె, వంటావార్పు తెలంగాణ ధూంధాంలో ఆయన కీలకపాత్ర పోషించారు. బ్రెయిన్ స్ట్రోక్ తో మాలే బాలప్ప మృతి చెందిన విషయం తెలుసుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ నాయకులు రాజుల ఆశిసిరెడ్డి, అరవింద్ కుమార్, సుధాకర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.