YCP | ఒంగోలులో వైసీపీ నిరసన

YCP | ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు : బాలకృష్ణ హిందూపురం పర్యటనలో కొంతమంది టీడీపీ నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ హిందూపురం పార్టీ కార్యాలయం పై దాడి చేసి ఫర్నిచర్, ఆఫీసు సిబ్బందిపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీనికి నిరసనగా జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి శాసన సభ్యులు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు అసెంబ్లీ ఇంచార్జ్ చుండూరి రవి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ఒంగోలులోని అంబేద్కర్ భవనం నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమం లో ఒంగోలు అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ చుండూరి రవి, నగర అధ్యక్షులు కటారి శంకర్, ఒంగోలు పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణ రెడ్డి, వై.వెంకటేశ్వర రావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమి రెడ్డి రవణమ్మ, కొత్తపట్నం పార్టీ మండల అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, దుంపా చెంచురెడ్డి, కిష్టపాటి శేఖర్ రెడ్డి, దుంపా యలమందరెడ్డి, వడ్లమూడి వాణి, మేరీ, పేరం ప్రసన్న, దేవా, వేముల శ్రీకాంత్, పులుసు సురేష్, కరుణాకర్, ముల్లంగి రవీంద్ర రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీందర్ రెడ్డి, బత్తుల ప్రమీల సిటీ మహిళా అధ్యక్షురాలు,కూనం గౌతమ్, పెట్లూరి ప్రసాద్, కోటిరెడ్డి, వెంకయ్య నాయుడు, పోలవరపు శ్రీమన్నారాయణ, టి.మాధవి, బెల్లంకొండ రవణమ్మ,జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలు గోవిందమ్మ,అమర్ 3వ డివిజన్ అధ్యక్షులు షేక్ అమిత్, సన్నీ, జాషువ తదితరులు పాల్గొన్నారు.
