డేంజర్ హైవే..

డేంజర్ హైవే..
నెల్లికుదురు, ఆంధ్రప్రభ : మండలంలోని నర్సింహులగూడెం శివారులో నడుస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించిన టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఫీల్డ్ హైవేలో టిప్పర్ తో మట్టి తోలుతున్న క్రమంలో నర్సింహుల గ్రామానికి చెందిన వనగండ్ల నరేష్ (35) వెళుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు టిప్పర్ ఢీకొట్టింది. వెంటనే హాస్పటల్ లో చేర్పించారు. అయితే.. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కేసు విచారణ చేస్తున్మామని తెలిపారు.
