జనం బాటలో.. కవిత..

జనం బాటలో.. కవిత..

మిర్యాలగూడ, ఆంధ్రప్రభ – నల్లగొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జనం బాట కార్యక్రమం బుధవారం రెండో రోజుకు చేరుకుంది. అయితే.. మంగళవారం దేవరకొండ నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో పర్యటించిన కల్వకుంట్ల కవిత రాత్రి మిర్యాలగూడ పట్టణంలోని ప్రముఖ రైస్ మిల్లర్ ఎస్. వెంకటేశ్వర్లు ఇంట్లో బస చేశారు. ఈ సందర్భంగా స్థానిక తెలంగాణ జాగృతి నాయకులు కవితకు ఘన స్వాగతం పలికారు.

బుధవారం ఉదయం మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కర్నాటి రమేష్ ల ఆధ్వర్యంలో స్థానిక రైస్ మిల్లర్లు కవితను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు బొగవల్లి వెంకటరమణ చౌదరి, రామశేఖర్,గందె రాము, రేపాల మధు, ఎస్. వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Leave a Reply