పోలీస్ స్టేషన్‌లో సామూహిక గేయాలాపన

శావల్యాపురం, ఆంధ్రప్రభ : బంకించంద్ర చటర్జీ వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భరతమాత పట్ల ప్రేమ, గౌరవ భావాలతో మండల కేంద్రమైన శావల్యాపురం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ లేళ్ళ లోకేశ్వరరావు ఆధ్వర్యంలో సామూహిక గేయాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతర గీతం చారిత్రక పాత్ర పోషించిందన్నారు. మన దేశ స్వాతంత్ర్య ఆత్మకు, మన ఐక్యతకు ప్రతీకగా నిలిచిన అజరామరమైన గీతమన్నారు.

Leave a Reply