ఒంగోలు ప్రతినిధి. ఆంధ్రప్రభ : ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ బెట్టింగ్ భూతం పై తనదైన శైలిలో ఉక్కు పాదానికి అడుగులు మొదలుపెట్టారు క్రికెట్ బెట్టింగ్ మోజులో అటు యువత ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారని కోట్ల రూపాయల సొమ్మును బెట్టింగులు పెట్టి బలవన్మరణాలకు దారితీస్తున్నారు.
దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రకాశం జిల్లాలో క్రికెట్ బుకీల పై పోలీసులు ప్రత్యేక చర్యలు గత రెండు రోజులుగా మొదలుపెట్టారు. దీనిలో భాగంగా జిల్లాలో బెట్టింగ్ బుకి లు జిల్లా దాటి పరారీలో ఉన్నారు నిత్యం ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ ఆడే బుకీలు కొద్దిరోజుల క్రితం జరిగిన మహిళా క్రికెట్ పోటీలు కూడ పై బెట్టింగ్లు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన యాప్ల ద్వారా రకరకాల మాధ్యమాల ద్వారా సామాన్య ప్రజలను ఆకర్షించి వారి వద్ద నగదును దోచేస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు.
కొద్ది రోజుల్లోనే అల్ప సంపాదన వల్ల కోట్ల రూపాయలు సాధించవచ్చునని ఎవరో కొంతమందిని చూసి భ్రమలో బతుకుతూ ఉన్న నగదును కూడా బెట్టింగుల్లో ఆడుతూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. దీంతో ఎస్పీ ఆదేశాలతో బుకీల వేటకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుని బుకీల కోసం వెతుకులాటలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే సింగరాయకొండలో కొంతమంది బుక్కీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ప్రకాశం జిల్లాలో ప్రధానంగా సింగరాయకొండ కేంద్రంగా బుకీల స్థావరాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో సైతం దేశాలను దాటుతూ కోట్ల రూపాయల జూదం ఆడుతూ ఎదేచ్చిగా తిరుగుతున్నారు. గత సంవత్సరం సింగరాయకొండ లోని బెట్టింగ్ భూతానికి సుమారు నలుగురు బలి అయిన సంఘటన అప్పట్లో కలకలం రేపింది.
ఎన్నో బలవన్మరణాలు కు బెట్టింగ్ కారణభూతమైంది. బెట్టింగ్ రాజాలపై పోలీసులు కేసులు నమోదు చేసిన ధన బలంతో మరల తిరిగి బెట్టింగ్ లాడుతూ ఎంతో మంది జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. ఈ బెట్టింగ్ వీరులు అల్ప సంపాదన కావడంతో భారీగా సింగరాయకొండ ఒంగోలు నెల్లూరు, హైదరాబాద్ ప్రధాన నగరాల్లో భారీ భవంతులు స్థలాలు కొనుగోలు చేశారు.
ప్రభుత్వ భూములు దేవాలయ భూములు సింగరాయకొండలో కొనుగోలు చేస్తూ తమదే ఇస్టారాజ్యం అంటూ వ్యవహరిస్తున్నారు ప్రధానంగా సింగరాయకొండ మండలంలో సింగరాయకొండ పటికి లేని వారి పాలెం పకీరుపాలెం శానంపూడి పాత సింగరాయకొండ గ్రామాలలో బుకీలు ఇంటికొకరుగా మారారని ఆ ప్రాంత ప్రజలే తెలుపుతున్నారు.
రాజకీయ అండదండలే ప్రధాన కారణం…..
క్రికెట్ బుకీ లకు ప్రధానంగా పోలీసుల చర్యలు జరుగుతున్న ఏమాత్రం భయం లేకుండా అదే వృత్తిలో కొనసాగడంపై సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం కోట్ల రూపాయలు సంపాదించి రాజకీయ నేతలకు పక్కనే ఉండటంతో వారి అండదండలు మెండుగా ఉన్నాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అటు అధికారపక్షంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ క్రికెట్ బుకీలదే హవాగా మారింది. పోలీసులు కూడా అధికారపక్షమైతే ఒకలాగా ప్రతిపక్షమైతే మరొక లాగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. దీంతో బుకీలు తమ ఇష్టానురాజ్యంగా క్రికెట్ బెట్టింగ్ జరుపుతూ అమాయకపు ప్రజల నుండి కోట్ల రూపాయలు దోచేస్తున్నారు ఎస్పీ హర్షవర్ధన్ ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని బుకీ అని కనబడితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలుపుతున్నారు.

