మంత్రి రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి
మంత్రి రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి
సంగారెడ్డి ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్‌లో ఉన్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వారందరినీ హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. ఉన్నత అధికారులంతా తక్షణమే హాస్పిటల్స్‌కు వెళ్లాలని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు.
