దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీధర్ బాబు

దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ రాష్ట్రం విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు ఆలయాల్లో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని ప్రముఖ ఆలయమైన మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో భజన బృందంతో పాటు పాల్గొని, భక్తి భావం చాటుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అమ్మవారి అనుగ్రహం వల్ల రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో దసరా పండ‌గ‌ను జరుపుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రజలకు ముందస్తుగా బతుకమ్మ (Bathukamma), దసరా పండుగ శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చర్యలు చేపడుతున్నామని, త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలతో ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ (Agricultural Market Committee Chairman) కుడుదల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఆర్టీఏ మెంబర్ సురేష్, పార్టీ మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పోలు శివ, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు, న్యాయవాది శశిభూషణ్ కాచే, మంథని మాజీ సర్పంచ్ వోడ్నాల శ్రీనివాస్, యువజన విభాగ అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు పెంట రాజేందర్, సోషల్ మీడియా ఇన్‌చార్జి ఆరేళ్ళి కిరణ్ గౌడ్ పాల్గొన్నారు.

Leave a Reply