అనేక సంస్కరణలు తెచ్చాం
అనేక సంస్కరణలు తెచ్చాం
రెవెన్యూ మంత్రి అనగాని
( ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి) : గత ఐదేళ్లలో అన్నిరంగాల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) మార్గ దర్శకత్వంలో అన్నిరంగాల్లో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందని, ఇందుకు ఈ కూటమి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister says Satya Prasad) అన్నారు. ఏపీ సచివాలయం (AP Secretariat)లో జరుగుతున్న కలెక్టర్ల (Collectors) సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఏపీ బ్రాండ్‌ను తిరిగి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సూపర్ హామీలు ఇచ్చి సూపర్ 12 అమలు చేశామని గుర్తు చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సమ ప్రాధాన్యం ఇచ్చి అన్ని పధకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్టు మంత్రి సత్య ప్రసాద్ (Minister Satya Prasad) స్పష్టం చేశారు.

జిల్లాల్లో కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రతినిధులని ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను పబ్లిక్ గ్రీవియోన్స్ (Public Grievances) రిడ్రస్సల్ సిస్టం ద్వారా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాలను అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రజల ఆస్తుల పరిరక్షణకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూడా రద్దు చేశామన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు జరగకుండా నివారించేందుకు శాఖలో అనేక మార్పులు తీసుకు వచ్చామని తెలిపారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములను పటిష్టంగా క్రమబద్ధీకరణ చేయడం జరిగిందని చెప్పారు.
అన్ని రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్ చేయడం ద్వారా ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నామన్నారు. రెవెన్యూ అప్పీళ్ళ సత్వర పరిష్కారానికి ఇ-కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు అయ్యేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని మంత్రి సత్య ప్రసాద్ స్పష్టం చేశారు. చివరగా ఇటీవల నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్, ఇతర మంత్రులు, కేంద్ర ప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
