బాలికపై…

బాలికపై…

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : బాలిక‌ల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డినవారికి కోర్టులు క‌ఠినంగా శిక్ష‌లు విధిస్తున్నా కామ పిశాచులు ఇంకా బాలిక‌ల‌పై లైంగిక దాడులు ఆగ‌డం లేదు. న‌ల్ల‌గొండ (Nalgonda) జిల్లా క‌న‌గ‌ల్ మండ‌లం షాబుల్లాపురంలో ఓ ద‌ళిత బాలిక‌పై లైంగిక‌దాడి జ‌రిగిన సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

నల్లగొండ జిల్లా కనగల్ మండలం (Kanagal Mandal) షాబుల్లాపురం గ్రామంలో ఈనెల 5వ తేదీన నిర్వహించిన గణేష్ నిమజ్జోత్సవాన్ని చూడడానికి వచ్చిన దళిత బాలికపై అదే గ్రామానికి చెందిన సుఖేందర్ అనే యువకుడు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడ‌ని ఆ కుటుంబ స‌భ్యులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. నిందితుడికి మన్నెం రాంబాబు, సోమ చందు (Mannem Rambabu, Soma Chandu) అనే యువకులు సహకరించారని వారు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి నిందితులపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనగల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

బాలిక‌ల‌పై లైంగిక‌దాడుల‌కు పాల్ప‌డుతున్న దోషుల‌ను కోర్టులు క‌ఠినంగా శిక్షిస్తున్నా కామాంధులు క‌ళ్లు తెర‌వ‌డం లేదు. ఇటీవ‌ల న‌ల్ల‌గొండ ((Nalgonda) జిల్లాలో ఒక దోషికి ఏకంగా 51 ఏళ్లు శిక్ష వేస్తూ కోర్టు తీర్పు (Court judgment) చెప్పిన తీరు రాష్ట్రంలోనే సంచ‌ల‌నం సృష్టించింది. అలాగే మ‌రో ఇద్ద‌రికి 20 ఏళ్ల‌కు పైగా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఇలాంటి శిక్ష‌లు చూసైనా కామాంధుల్లో మార్పు వ‌స్తే మంచిది.

Leave a Reply