AP| కూటమి పాలనకు ఏడాది – దీపావళి – సంక్రాంతిలా వేడుకలు జనసేన పిలుపు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పాలనకి ఏడాది పూర్తవడంతో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించనుంది.

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ నాయకత్వంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన ఏడాది ఉత్సవాలు చేస్తోంది జనసేన. సుపరిపాలన ప్రారంభమై ఏడాది.. పీడ విరగడై ఏడాది అంటూ, ఈ నెల 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకోవాలని జనసేన నిర్ణయించింది.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పిలుపుతో జనసేన కూటమి ప్రభుత్వానికి ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తోంది. జనసేన నేతలు, శ్రేణులు తమ వాకిళ్లను రంగవల్లులతో అలంకరించాలనీ, ముగ్గుల పోటీలు నిర్వహించాలనీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి దిశానిర్దేశం అందింది. దీంతోపాటు సాయంత్రం దీపావళి తరహాలో దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చాలని సూచించారు. ఈ వేడుకలన్నింటినీ సోషల్ మీడియాలో పోస్టులు రూపంలో ప్రదర్శించాలని పార్టీ కోరుతోంది. ఈ సందర్భంగా డిజిటల్ క్యాంపెయిన్‌కి కూడా జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

Leave a Reply