బెంగాల్ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం మమతా బెనర్జీ ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ఓట్ల దోపిడీకి బీజేపీ పాల్పడుతోందని మమత ఆరోపించారు. బీజేపీ నేతలు దొంగలు మాత్రమే కాకుండా బందిపోట్లు కూడా అని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం మరింత పెరిగింది.
ఈ క్రమంలో, టీఎంసీ ఎమ్మెల్యేలకు విపక్ష నేత సువేందు అధికారి ప్రసంగాన్ని అడ్డుకోవాలని సూచించారు. ఓటమి భయంతోనే బీజేపీ సభలో గొడవలకు దిగుతోందని మమత తీవ్రంగా వ్యాఖ్యానించారు.
తరువాత టీఎంసీ–బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చెలరేగడంతో పరిస్థితి అదుపు తప్పింది. మార్షల్స్ జోక్యం చేసుకున్నప్పటికీ, కొందరు ఎమ్మెల్యేలు బాటిళ్లు విసరడంతో ఉద్రిక్తత హింసాత్మక స్థాయికి చేరుకుంది. చివరికి, స్పీకర్ ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయగా, ఈ సంఘటనలో పలువురు ఎమ్మెల్యేలు గాయపడ్డారు.

