16hrs | వెన్నులో వణుకు పుట్టిస్తున్న యూపీ ఘటన!
16hrs | వెన్నులో వణుకు పుట్టిస్తున్న యూపీ ఘటన!
16hrs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత చేసే సాహసాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. రీల్స్ చేసేందుకు ఒక పాత వాటర్ ట్యాంక్ ఎక్కిన ఐదుగురు మైనర్ బాలుర ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ్‌నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఐదుగురు బాలురు రీల్స్ షూట్ చేయడం కోసం చాలా కాలంగా నిరుపయోగంగా ఉన్న ఒక పాత వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కారు. అయితే, వారు పైకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ట్యాంక్ నిచ్చెన విరిగిపోయింది. నిచ్చెన విరిగిపోవడంతో ముగ్గురు బాలురు ఒక్కసారిగా పైనుంచి కింద పడిపోయారు. కింద పడిన వారిలో ఒక బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
మిగిలిన ఇద్దరు బాలురు ట్యాంక్ పైనే చిక్కుకుపోయారు. కిందకు దిగే మార్గం లేకపోవడంతో దాదాపు 16 గంటల పాటు భయం గుప్పిట్లో అక్కడే గడిపారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు, రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. ట్యాంక్ పాతది కావడంతో పాటు, ఎత్తు ఎక్కువగా ఉండటంతో వారిని కాపాడటం సవాలుగా మారింది. చివరకు ప్రభుత్వం సహాయం కోరడంతో భారత వైమానిక దళానికి (IAF) చెందిన హెలికాప్టర్ రంగంలోకి దిగింది. అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన వైమానిక దళ సిబ్బంది, ట్యాంక్‌పై చిక్కుకున్న ఇద్దరు బాలురను సురక్షితంగా రక్షించి కిందకు దించారు.
