ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించిన మున్సిపాలిటీ

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని గురువారం భీమ్‌గల్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలు, త్యాగాలు, చూపిన మార్గం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ప్రొఫెసర్ జయశంకర్ సేవలను స్మరించుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, కౌన్సిలర్లు తోట సతీష్, అంజుమ్ ఆలీ, సంగ్యా నాయక్, మామరి సందీప్, ప్రజాప్రతినిధులు నాగేంద్రబాబు, అనంతరావు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.