జానకంపేట్ లో ఘనంగా బాబు జాగ్జీవన్ రాం జయంతి

ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఆదివారం స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రాం 19వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. కార్యక్రమంలో దండోరా సంఘం సభ్యులు జింక లింగం, గద్ద సాయిలు, సరికెల సందీప్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply