- జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి..
- సీఐ సంపత్‌కుమార్
బిక్కనూర్, (ఆంధ్రప్రభ): జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న పాత కేసులను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉన్నందున, కక్షిదారులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని బిక్కనూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్‌కుమార్ సూచించారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని.. కామారెడ్డి జిల్లా కోర్టులకు హాజరై తమ కేసులను త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
పోలీస్ స్టేషన్ వారీగా పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన నేరస్తులకు ముందుగానే సమాచారం అందించామని సీఐ పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని రాజీమార్గం ద్వారా సమస్యలను తీర్చుకోవడం అందరికీ ఉపయోగకరమని ఆయన సూచించారు.

