వల్లాపురం గ్రామపంచాయతీలో ఆచార్య జయశంకర్‌కు ఘన నివాళి

జయశంకర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి

నడిగూడెం, ఆంధ్రప్రభ: ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నడిగూడెం మండలంలోని వల్లాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ చిత్రపటానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి సరితా లక్ష్మయ్య, గ్రామ కార్యదర్శి మల్లారెడ్డి, వైస్ సర్పంచ్ కోటా చంద్రశేఖర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేసిన మహనీయుడిగా ఆచార్య జయశంకర్ సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు శ్రీమతి వాణి, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొని ఆచార్య జయశంకర్‌కు ఘన నివాళులర్పించారు.