నిషేధిత మాదక ద్రవ్యాలు అమ్మితే..

నిషేధిత మాదక ద్రవ్యాలు అమ్మితే..
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : నిషేధిత మాదక ద్రవ్యాలు అమ్మకాలు జరిపితే.. కఠిన చర్యలు తప్పవని సీఐ చరమందరాజు తెలిపారు. జిల్లా ఎస్పీ ఎన్.నరసింహ ఆదేశాల మేరకు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా హుజూర్ నగర్ పట్టణంలో సిఐ చరమందరాజు పోలీస్ సిబ్బందితో కలిసి పాన్ షాపులలో తనిఖీలు చేపట్టారు. నిషేధిత మాదకద్రవ్యాల అమ్మకాలు చేసినా, సేవించినా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అనంతరం నిషేధిత మాదకద్రవ్యాల పైన అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ బండి మోహన్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
