రూ.5 వేల ఆర్థిక సాయం

కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ అండ

కన్నాయిగూడెం, ఆగస్టు 5 (ఆంధ్రప్రభ): కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పీరీల పాపారావు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాంబాబు పరామర్శించారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షుడు పైడకుల అశోక్ సూచనలతో మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి జాడి రాంబాబు బుధవారం పాపారావు నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా జాడి రాంబాబు మాట్లాడుతూ, పీరీల పాపారావు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకుని పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. మంత్రి సీతక్క అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ బలోపేతానికి విశేషంగా సేవలందించిన పాపారావును కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేర్ప పగిడయ్య, స్థానిక సర్పంచ్ పీరీల స్వప్న–ప్రేమ్, లక్ష్మీపూర్ సర్పంచ్ అగ్గు రోజా–వెంకటేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోట నాగేష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మాదాసు రాజేందర్, తుపాకులగూడెం సీనియర్ నాయకులు కోరం సమ్మయ్య, సండ్ర శేఖర్, సీతారాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.