ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
కొడిమ్యాల, ఆంధ్రప్రభ: కొడిమ్యాల మండలం పోతారం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలను అంగన్‌వాడీ టీచర్ బొడ్డు విజయ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు.
పిల్లలు పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు. తల్లులు సమతుల్య పోషకాహారం తీసుకుంటేనే శిశువులకు అవసరమైన పోషకాలు అందుతాయని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజయ్య, పంచాయతీ కార్యదర్శి మహేష్, ఆయా, గర్భిణులు, బాలింతలు, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.
