Peddapalli | తెలంగాణలో వడగండ్ల వాన.. పలు జిల్లాలలో జలమయమైన రహదారులు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణలో పలు చోట్ల నేడు భారీ వర్షం పడుతుంది. ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. మంచిర్యాల, కొరుముం భీం , జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. మంచిర్యాల మండలంలోని లక్సెట్టిపేట మండలంలో వర్షం తో పాటు ఈదురుగాలులు వీచాయి. దీంతో షాపుల పైకప్పులు ఎగిరిపోయాయి. వృక్షలు నేలకొరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

వడగళ్ల వాన కూడా… లక్సెట్టిపేట మండలంలో వడగళ్ల వాన కూడా పడింది. కాగజ్ నగర్ లోనూ అనేక దుకాణాల పైకప్పులు ఎగిరిపోయాయి. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పోచమ్మ చెట్టు కూలిపోవడంతో వాహనాలను ఆ మార్గం నుంచి వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు. ఎండలు ముదుతున్న సమయంలో అకాల వర్షంతో ప్రజలు ఊరట చెందినా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది పడుతున్నారు.

పెద్ధపల్లిలో సైతం …

పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుండి సూర్యుడి ప్రతాపంతో జనం అల్లాడారు. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వ‌డ‌గండ్ల వాన కురవ‌డంతో వాతావరణం ఒక్క‌సారిగా చల్లబడింది. వడగండ్ల వానతో చిన్నారులు రోడ్లపైకి చేరి వ‌డ‌గండ్లు వేరుకుంటూ కనిపించారు. భారీ వర్షం కురవ‌డంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

Leave a Reply