తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ: డీడబ్ల్యూవో మల్లేశ్వరి
భూపాలపల్లి, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా భూపాలపల్లి జిల్లా పెద్దకుంటపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి జి. మల్లేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై శిశువులకు అన్నప్రాసన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు పట్టించడం ఎంతో అవసరమని సూచించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు రోగనిరోధక శక్తిని అందిస్తాయని, తల్లి–బిడ్డల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తాయని తెలిపారు. గర్భిణులు, బాలింతలు తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే అందించాలని అవగాహన కల్పించారు. అనంతరం తల్లులు, గర్భిణులతో కలిసి తల్లిపాల ప్రాముఖ్యతపై గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మోతె రాజు, సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు అపర్ణ, సువర్ణ, అరుణ, సుగుణ, అమృత, ఏఎన్ఎం చంద్రకళ, ఆశా కార్యకర్తలు, ఆయాలు, తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
