వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి..
- పోస్ట్‌కార్డు ఉద్యమానికి సన్నాహాలు.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్న ఉద్యోగులు
తిరుపతి సిటీ, ఆంధ్రప్రభ : వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ఓపిఎస్ స్కీమ్ వర్తింప చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. వైద్యఆరోగ్య శాఖలో మే 25వ తేదీ 2002 సంవ త్సరం నోటిఫికేషన్ ద్వారా గత 22 సంవత్సరాలుగా కాంటాక్ట్ పద్ధతిపై పనిచేస్తూ ఏప్రిల్ 1వ తేదీ 20, 24న రెగ్యులరయ్యారు. వైద్య ఆరోగ్యశాఖలో హెల్త్ అసిస్టెంట్, లాబ్ టెక్నీషియన్, ఫార్మ సిస్టులకు ఓల్డ్ పెన్షన్ స్కీం, పెన్షన్ స్కీం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగంలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు పడుతూ ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్నారు.
అలాగే కరోనా సమయంలో తమ కుటుంబాలను సైతం పక్కనపెట్టి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో విశేషంగా కృషి చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 1998 సంవత్స రంలో వోకేషనల్ ఇన్స్పెక్టర్గా కాంటాక్ట్ ఉద్యోగాలుగా నియామించారు. ఈ నియామక పొందిన 2007`08 సంవత్సరంలో రెగ్యులర్ కాబడిన వారికి కంట్రిబ్యూషన్ పెన్షన్ నుంచి, ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు చేశారు. వీరితో పాటు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు కూడా ఓల్డ్ పెన్షన్ స్కీం వర్తింపజేయాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చేందుకు దశలవారీగా ఉద్యోగులు శాంతియుతంగా తమ ఉద్యమాన్ని చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇందులో భాగంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు పోస్ట్ కార్డు ఉద్యమం, ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్‌కు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు విన్నవించడంతోపాటు మంత్రులకు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకు వెళ్లేందుకు వారు సన్నద్ధమవుతున్నారు. తాము న్యాయమైన డిమాండ్ అడుగుతున్నామని ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తాము ప్రజలకు ప్రాణాలను ప్రాణంగా పెట్టి సేవలందిస్తున్నామని వారు పేర్కొంటున్నారు. తాము ఉద్యోగం నుంచి విశ్రాంతి అయిన తర్వాత తమ కుటుంబాన్ని పోషించుకునేందుకు తమకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ప్రధాన డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తమ పోరు సాగిస్తున్నామంటున్నారు. అలాగే వివిధ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లు సాధనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వారు ఉద్యమ పోరుకు సన్నద్ధమవుతున్నారు.
