హైదరాబాద్కు బయలుదేరిన విశ్రాంత ఉద్యోగుల నేతల అరెస్ట్
వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం వనపర్తి జిల్లా నాయకులు మంగళవారం హైదరాబాద్కు బయలుదేరారు. ఈ సందర్భంగా వనపర్తి ఆర్టీసీ కాలనీ సర్కిల్ వద్ద వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ చర్య చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. స్టేషన్కు తరలించిన వారిలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగ నాయకులు రామచంద్రరెడ్డి, సత్యనారాయణ గౌడ్, సత్తయ్య, ఇస్మాయిల్ పాషా, బీవీ రావు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ హామీలను అమలు చేయడంతో పాటు తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
