గత 24 నెలల అభివృద్ధే మా బలం

సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

మధురానగర్, ఆంధ్రప్రభ: ప్రజల సంతృప్తే మా విజయానికి కొలమానమని సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.స్థానిక 28వ డివిజన్ భాను నగర్ సిగ్నల్  వద్ద నుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలతో  ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ల్,టీడీపీ శ్రేణులతో కలిసి ప్రజలకు కరపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లలో పార్టీ శ్రేణులు విస్తృతంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తున్నామని అన్నారు.

గత 24 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, మా కుమారులు నిత్యం సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరిస్తున్నారని, ప్రజలు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ విశేష ఆదరణ చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్, క్లస్టర్ ఇంచార్జ్ ఘంటా కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షులు శ్రీను, ప్రధాన కార్యదర్శి పవన్, జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.