టీడీపీ కార్యకర్త తండ్రిని పరామర్శించిన బొండా ఉమా..

ధైర్యంగా ఉండండి అంటూ భరోసా..


(పాయికాపురం, ఆంధ్రప్రభ ) : విజయవాడలోని స్వర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త పరుచూరి ప్రసాద్ తండ్రి పరుచూరి సాంబశివరావును ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సోమవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

విజయవాడలోని స్వర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తన వీరాభిమాని పరుచూరి ప్రసాద్ తండ్రి పరుచూరి సాంబశివరావును ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్న బొండా ఉమా, అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.

అనంతరం పరుచూరి ప్రసాద్‌ను ఓదార్చుతూ, కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పరామర్శతో కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కష్టసమయంలో పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబాలకు అండగా నిలవడం బొండా ఉమా ప్రత్యేకత అని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.